Posts

కృష్ణాష్టమి పూజా

కృష్ణ జన్మాష్టమి   శ్రీ మహావిష్ణువు  బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో  ఎనిమిదవ అవతారం   శ్రీకృష్ణుడు  జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. తిథి శ్రీకృష్ణుడు   దేవకి   వసుదేవులకు   దేవకి  ఎనిమిదో గర్భంగా  శ్రావణమాసము  కృష్ణ పక్షం  అష్టమి  తిథి రోజు  కంసుడి  చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన  పంచాగం  ప్రకారం  శ్రావణ బహుళ అష్టమి  తిథి. ఇదే రోజు  రోహిణి  నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా  ఉపవాసం   ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు&#

వినాయక చవితి పూజా

భాద్రపద మాసంలో వచ్చే వినాయక చతుర్థి పండుగ నాడు ఆచరించవలసిన పూజా విధానాలను పూర్తి వివరణలతో అందిస్తున్నాము పూజానంతరం చదువవలసిన వ్రత కథను కూడా అందించాము. వినాయక పూజా విధానము/వినాయక వ్రత కల్ప విధానము పూజకు కావలసిన సామగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు. చిన్నారి దేవుళ్ళ పండుగ వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు. పూజా సన్నాహం వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చే